తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2019, 11:38 PM IST

ETV Bharat / international

బ్రిటన్​ ఎన్నికలకు విపక్షం అంగీకారం

బ్రిటన్​లో డిసెంబర్​లో ఎన్నికలు నిర్వహించేందుకు విపక్ష లేబర్ పార్టీ అంగీకరించింది. అయితే ప్రధాని ప్రతిపాదించిన డిసెంబర్ 12న కాక.. ఆ నెల 9నే ఎన్నికలు నిర్వహించాలని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ నేత జెరెమీ కార్బిన్ ప్రకటన విడుదల చేశారు.

బ్రిటన్​ ఎన్నికలకు విపక్షం అంగీకారం

బ్రిటన్ పార్లమెంట్​కు డిసెంబర్​లోనే ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతిపాదనకు విపక్ష లేబర్​ పార్టీ అంగీకారం తెలిపింది. అయితే ఎన్నికలకు సంబంధించి తేది నిర్ధరణ కాలేదు.

"మేం ఎన్నికలకు సిద్ధమేనని స్థిరంగా చెబుతున్నాను. 'నోడీల్​ బ్రెగ్జిట్​'ను బోరిస్​ ప్రభుత్వం పక్కన పెడితే.. మేము కచ్చితంగా ఎన్నికలను అంగీకరిస్తాం. దేశంలో నిజమైన మార్పును తీసుకువచ్చే దిశగా ప్రచారాన్ని ప్రారంభిస్తాం."

-జెరెమీ కార్బిన్, లేబర్​ పార్టీ నేత

సోమవారం ఈయూ నేతలు తీసుకున్న నిర్ణయం పట్ల స్పందించారు కార్బిన్. రాబోయే మూడు నెలల్లో.. ఎలాంటి ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగే అంశాన్ని ప్రభుత్వం పక్కనపెట్టడం వల్ల తాము విజయం సాధించామన్నారు.

బోరిస్ జాన్సన్ డిసెంబర్ 12వ తేదిన ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించగా.. లేబర్ పార్టీ సహా ఇతర విపక్షాలు డిసెంబర్ 9నే పోలింగ్​ నిర్వహించాలని కోరుతున్నాయి.

ఇదీ చూడండి: దిల్లీని కాపాడాలని పొరుగు రాష్ట్రాలకు సీఎం విజ్ఞప్తి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details