బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ వారం ఐరోపా దేశాలను సందర్శిస్తారు. రెండున్నర నెలలుగా... ఒప్పందాలు లేని బేషరతు బ్రెగ్జిట్ గురించి భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
"బోరిస్ జాన్సన్ బుధవారం బెర్లిన్ చేరుకుంటారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో చర్చలు జరుపుతారు. గురువారం పారిస్ వెళ్లి, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తోనూ సమావేశమవుతారు."- డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం
బ్రిటన్‌కు ఈయూ సభ్యత్వాన్ని అమలుచేసే దశాబ్దాల నాటి చట్టాన్ని రద్దుచేయాలని బోరిస్ ప్రభుత్వం భావిస్తోంది.
బోరిస్ దౌత్యం..
ఫ్రాన్స్‌లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సదస్సుకు ముందు... బోరిస్ జాన్సన్ ఐరోపా దేశాల్లో దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెగ్జిట్ నిబంధనలపై మరోమారు చర్చలు చేపట్టాలని బోరిస్ కోరవచ్చు. లేదా బ్రెగ్జిట్‌కు ఆఖరి తేదీ అయిన అక్టోబర్ 31న ఈయూ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందని హెచ్చరించవచ్చు.