ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ సతీమణి, ఆ దేశ ప్రథమ మహిళ ఒలేనా జెలెన్స్కా కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె తెలిపారు. కుటుంబ సభ్యులకు తన వల్ల వైరస్ ముప్పు ఉండకూడదనే ఉద్దేశంతో వారి నుంచి ఏకాంతంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన భర్త, పిల్లలకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు చెప్పారు ఒలేనా.
ఉక్రెయిన్ ప్రథమ మహిళకు కరోనా పాజిటివ్ - Ukrainian President Volodymyr Zelenskiy wife news
ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలేనా జెలెన్‌స్కాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన కుటుంబ సభ్యులను ప్రమాదం లోకి నెట్టకుండా ఉండేందుకు ఆమె ఏకాంతంగా ఉంటున్నట్లు చెప్పారు.
ఉక్రెయిన్ ప్రథమ మహిళకు కరోనా పాజిటివ్
ఐరోపా దేశం ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 29వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 870 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ ప్రభావం తగ్గిందని మే చివరి నుంచి ఆ దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించారు. ప్రజారవాణా పునరుద్ధరించారు. షాపింగ్ మాల్స్, జిమ్ కేంద్రాలు తెరిచేందుకు అనుమతిచ్చారు.