Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం అవుతున్న నేపథ్యంలో ఓ రైతు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యా బలగాలు యుద్ధ ట్యాంకర్‌తో తమ ప్రాంతానికి చేరుకున్నట్లు గుర్తించిన రైతు.. ట్రాక్టర్‌తో గుట్టుచప్పుడు కాకుండా అక్కడకు చేరుకున్నాడు. తన ట్రాక్టర్‌కు ఆ యుద్ధ ట్యాంకర్‌ను అనుసంధానం చేసి అక్కడి నుంచి తరలించాడు. ఇది గమనించిన రష్యా సైనికుడు ఆ వాహనాల వెనుక పరిగెడుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
రష్యా యుద్ధ ట్యాంకును ఎత్తుకెళ్లిన రైతు - యుద్ధ ట్యాంకు చోరీ
Ukraine Russia War: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తీవ్రతరం చేస్తోంది. భారీ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులతో రష్యా బలగాలు ఉక్రెయిన్ నగరాల్లోకి దూసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ఆ రైతు ఏం చేశాడు అనుకుంటున్నారా..? శత్రు దేశానికి చెందిన యుద్ధ ట్యాంకునే ఎత్తుకెళ్లాడు మరి..!
బ్రిటిష్ కన్జర్వేటివ్ నేత, ప్లైమౌత్ మూర్ వ్యూ పార్లమెంటు సభ్యుడు జానీ మెర్సర్ ఈ వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 'అతనేం నిపుణుడు కాదు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు నేడు రష్యా యుద్ధ ట్యాంకర్‌ను దొంగిలించాడు. రష్యా దాడి క్షీణిస్తున్నట్లు కనిపిస్తోంది' అంటూ ట్వీట్ చేశారు. రైతు చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. దేశాన్ని రక్షించేందుకు ఓ పౌరుడు ఏదైనా చేయగలడు అని ప్రశంసిస్తున్నారు. ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికే 4.6 మిలియన్ల మంది వీక్షించారు.
ఇదీ చూడండి :ఉక్రెయిన్ నింగిపై పట్టు కోసం రష్యా తిప్పలు.. బాంబులు లేవా?