ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఖార్కివ్‌లో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన పరిస్థితిపై పుతిన్‌తో చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సంఘర్షణ ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించడంపై పుతిన్‌తో మోదీ మాట్లాడినట్లు చెప్పింది. ఆరు రోజులుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో పుతిన్‌తో మోదీ మాట్లాడటం ఇది రెండోసారి.
రష్యా కీలక ప్రకటన
యుద్ధంలో తమ సైనికుల మృతిపై తొలిసారి రష్యా ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై దాడుల ఘటనలో 498 మంది సైనికులు మరణించినట్లు ఆ దేశ రక్షణశాఖ తెలిపింది. మరో 1,597 మంది గాయపడ్డారని పేర్కొంది.