Ukraine Russia News: ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చే శరణార్థులకు బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 'హోమ్స్ ఫర్ ఉక్రెయిన్' ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. బ్రిటన్ వాసులు ఎవరైన ఉక్రెయిన్ శరణార్థులకు ఇల్లు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తే ప్రభుత్వం ప్రతినెల ఒక్కో శరణార్థికి 450 డాలర్లు చొప్పున చెల్లిస్తుంది. ఈ విషయాన్ని బ్రిటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిషెల్ గోవె వెల్లడించారు. నీడ అవసరమైన వారికి మనమందరం కలిసి సురక్షితమైన ఇంటిని ఇద్దాము అని మిషెల్ గోవె పేర్కొన్నారు.
ఈ పథకంలో శరణార్థులకు కనీసం ఆరు నెలల అద్దె లేకుండా ఇల్లు ఇచ్చేందుకు ముందుకొచ్చే వారి పేర్లను సంబంధిత అధికారవర్గాల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, వ్యాపార సంస్థలు ఎవరైనాఇక్కడ నమోదు చేయించుకోవచ్చని వెల్లడించింది. ఈ రకంగా ఆశ్రయం ఇచ్చిన వారికి నెలకు 450 డాలర్లు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.