తెలంగాణ

telangana

ETV Bharat / international

జెలెన్​స్కీకి మోదీ ఫోన్- శాంతియుత పరిష్కారానికి పిలుపు

Ukraine Russia News: ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో మాట్లాడారు. భారతీయ విద్యార్థుల తరలింపులో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

pm modi
ప్రధాని మోదీ

By

Published : Mar 7, 2022, 12:36 PM IST

Updated : Mar 7, 2022, 3:02 PM IST

Ukraine Russia News: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ ఫోన్​కాల్​లో ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. సమస్య పరిష్కారం కోసం రష్యాతో చర్చలు కొనసాగిస్తుండటంపై ఉక్రెయిన్​ను మోదీ అభినందించారు.

యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో ఉక్రెయిన్​ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. సుమీలోని భారతీయులను తరలించడంలో కూడా ఉక్రెయిన్​ తన సహకారాన్ని అందించాలని ప్రధాని కోరారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

"ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితుల గురించి జెలెన్​స్కీ.. మోదీకి వివరించారు. ఘర్షణ, దాని ఫలితంగా ఏర్పడిన మానవతా సంక్షోభంపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చారు. భారత్ ఎల్లప్పుడూ శాంతియుతమైన పరిష్కారాల కోసమే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు."

-ప్రధాన మంత్రి కార్యాలయం

ఉక్రెయిన్​పై రష్యా దాడి చేసిన తర్వాత ఇరువురు నేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి.

జెలెన్​స్కీ ట్వీట్

ఫోన్​కాల్ అనంతరం ట్వీట్ చేసిన జెలెన్​స్కీ.. 'రష్యా దురాక్రమణ'పై మోదీకి వివరించినట్లు చెప్పారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఉన్నతస్థాయి శాంతి చర్చలు జరగాలని భారత్ కోరుకుంటోందని అన్నారు. యుద్ధ సమయంలో ఉక్రెయిన్​లోని భారత పౌరులకు సహాయం చేసినందుకు మోదీ అభినందించారని వివరించారు.

ఇదీ చదవండి:ఉక్రెయిన్​పై దాడులకు రష్యా తాత్కాలిక విరామం

Last Updated : Mar 7, 2022, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details