తెలంగాణ

telangana

సుందర దేశం ధ్వంసం.. భావోద్వేగ వీడియో షేర్ చేసిన జెలెన్​స్కీ

By

Published : Mar 18, 2022, 9:04 AM IST

Updated : Mar 18, 2022, 10:54 AM IST

ukraine president zelensky emotional video: అందమైన ప్రదేశాలు.. చారిత్రక కట్టడాలు.. పర్యటకుల కేరింతలతో ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆ దేశంలో నేడు బాంబుల మోత మోగుతోంది. పెద్ద పెద్ద భవంతులు అగ్నికీలలకు ఆహుతవుతున్నాయి. వీధుల్లో శవాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. రష్యా దాడులతో అల్లాడిపోతోన్న ఉక్రెయిన్‌లో ఇప్పుడు ఎటుచూసినా కన్పిస్తోన్న హృదయవిదారక దృశ్యాలివే. ఉక్రెయన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ భావోద్వేగ వీడియోను తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు.

ukraine pictures
ఉక్రెయిన్​లోని దృశ్యాలు

ukraine president zelensky emotional video: రష్యా దండయాత్రతో తమ దేశంలో ఎంతగా ధ్వంసమైందో తెలుపుతూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్‌ చేశారు. దాడులకు ముందు ఉక్రెయిన్‌ ఎలా ఉందో.. ఇప్పుడు ఎంతటి భయానక పరిస్థితుల్లో చిక్కుకుందనేది ఆ వీడియో కళ్లకు కడుతోంది. బాంబు దాడిలో మంటల్లో ధ్వంసమైన భవనాలు, మరియుపోల్‌ ప్రసూతి ఆసుపత్రి వద్ద రోగుల ఆర్తనాదాలు, తల్లిదండ్రులను విడిచి పొరుగు దేశానికి ఏడుస్తూ వలస వెళ్తోన్న చిన్నారుల దుస్థితి, దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వందల మంది పౌరుల సామూహిక ఖననాల వంటి హృదయ విదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఇది మారణహోమం గాక మరేంటీ? అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి.

బుధవారం అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్‌స్కీ.. ఈ వీడియోను అక్కడి ప్రతినిధుల ముందు ఈ వీడియోను ప్రదర్శించారు. "ఒక్కసారి ఈ వీడియో చూడండి.. రష్యా సేనలు మా దేశంలో ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నాయో అర్థమవుతుంది" అని ఆయన తెలిపారు. ఇప్పటికైనా తమ దేశంపై నో ఫ్లై జోన్‌ ప్రకటించాలని ఆయన వేడుకున్నారు. ఈ వీడియోను చూసిన అమెరికా చట్టసభ ప్రతినిధులు కొందరు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చదవండి:ఉక్రెయిన్​లో ఆగని మారణహోమం.. చర్చలతో ఈసారైనా..

Last Updated : Mar 18, 2022, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details