తెలంగాణ

telangana

ETV Bharat / international

అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా దాడి.. ఐఏఈఏ ఆందోళన

Ukraine Nuclear Power Plant: ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రం జపోరిజ్జియాపై రష్యా సైన్యం దాడి చేసింది. ఈ క్రమంలో ఓ రియాక్టర్​ ధ్వంసమై మంటలు వ్యాపించాయి. ఇది పేలుడుకు గురైతే చెర్నోబిల్​ పేలుడు కంటే 10 రెట్లు ఎక్కువ నష్టం ఉంటుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు.

Ukraine Nuclear Power Plant
ఉక్రెయిన్

By

Published : Mar 4, 2022, 8:35 AM IST

Updated : Mar 4, 2022, 11:58 AM IST

జపోరిజ్జియా అణు కేంద్రంపై రష్యా దాడి

Ukraine Nuclear Power Plant: ఉక్రెయిన్​పై గత వారం రోజులుగా క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా.. ఇప్పుడు అక్కడి అణు విద్యుత్తు కేంద్రమే లక్ష్యంగా దాడులు చేపడుతోంది. ఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్​గా పేర్కొనే ఎనర్హోదర్​ నగరంలోని జపోరిజ్జియా కేంద్రంపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆ ప్రాంతంలో మంటలు చెలరేగి పరిస్థితి ఆందోళకరంగా మారింది. రష్యన్ సేనలు దాడులు ఆపకపోతే పెను విధ్వంసం తప్పదని అణు విద్యుత్తు కేంద్రం ప్రతినిధి హెచ్చరించారు.

"రష్యన్​ సేనలు న్యూక్లియర్​ ప్లాంట్​పై దాడి చేయడం వల్ల అక్కడ మంటలు చెలరేగాయి. దాడి జరిగిన ప్రాంతంలోని రియాక్టర్​ ప్రస్తుతం వినియోగంలో లేకున్నా అందులో అణు ఇంధనం ఉంది. దాడులు ఆపకపోతే అది పేలి పెను విధ్వంసం జరిగే అవకాశం ఉంది."

-అండిరీ టూజ్​, అణు కేంద్రం ప్రతినిధి

చెర్నోబిల్​ కంటే 10 రెట్లు..

జపోరిజ్జియా ఎన్​పీపీ పేలినట్లయితే జరిగే నష్టం చెర్నోబిల్​ పేలుడు కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుందని హెచ్చరించారు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా.

అణు విద్యుత్తు కేంద్రంపై దాడులకు సంబంధించిన వీడియోను.. ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ కార్యాలయం సలహాదారు ట్వీట్​ చేశారు. ఉక్రెయిన్​లోని 25 శాతం విద్యుత్తు.. ఈ అణు విద్యుత్తు కేంద్రం ద్వారా అందుతోంది.

ఒక్కోటీ 950 మెగావాట్ల రియాక్టర్లు..

జాపోరిషియా రియాక్టర్‌ ఉక్రెయిన్‌లోని ఎనర్హోదార్‌ అనే పట్టణం వద్ద ఉన్నాయి. సోవియట్‌ యూనియన్‌ మొత్తం ఆరు రియాక్టర్లను ఇక్కడ నిర్మించింది. ఒక్కో రియాక్టర్‌ 950 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. 1984లో చేపట్టిన వీటి నిర్మాణం 1994 వరకు కొనసాగింది. మొత్తం సామర్థ్యం 5.7 గిగావాట్లు. ఇది 40 లక్షల కుటుంబాలకు నిరంతరాయం విద్యుత్తును సరఫరా చేయగలదు. ఉక్రెయిన్‌ మొత్తం విద్యుత్తులో ఈ కేంద్రం వాటా దాదాపు 20 శాతం ఉంటుంది.

ఐఏఈఏ ఆందోళన​..

రష్యన్​ సేనల దాడుల కారణంగా అణు విద్యుత్తు కేంద్రంలో రేడియేషన్ స్థాయి పెరిగినట్లు గుర్తించామని ఉక్రెయిన్​ అధికారులు వెల్లడించారు. అణు విద్యుత్తు కేంద్రంలో చెలరేగిన మంటలు ప్లాంట్​లోని కీలక పరికరాలపై ప్రభావం చూపలేదని అంతర్జాతీయ అణు శక్తి కేంద్రం( ఐఏఈఏ) వెల్లడించింది. సిబ్బంది తగిన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.

" ఉక్రెయిన్​ ప్రధాని డెనిస్​ శ్యామగల్​, ఉక్రెయిన్​ అణు విద్యుత్తు నియంత్రణ, నిర్వహణ సంస్థతో ఐఏఈఏ డైరెక్టర్​ జనరల్​ రఫీల్​ మారియానోగ్రోసి మాట్లాడారు. అణు కేంద్రంపై దాడులను ఆపాలను కోరారు. రియాక్టర్​ పేలితే భారీ ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించారు."

- ఐఏఈఏ

నాటో దేశాల ఆందోళన

ఉక్రెయిన్​లోని అతిపెద్ద న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​పై రష్యన్​ సేనలు దాడులకు పాల్పడిన క్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​. ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో ఫోన్​లో మాట్లాడినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది.

"ఈరోజు ఉదయం ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో యూకే ప్రధాని బోరిస్​ జాన్సన్​ మాట్లాడారు. అధ్యక్షుడు పుతిన్​ నిర్లక్ష్యపూరితమైన దాడులు ఇప్పుడు ఐరోపా మొత్తం భద్రతకు ముప్పుగా మారాయని.. పరిస్థితులు మరింత దుర్భలంగా మారకుండా ఉండేందుకు యూకే అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు."​

- యూకే ప్రభుత్వం

అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి..

అణు కేంద్రంపై రష్యా దాడి చేపట్టిన నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​ డిమాండ్​ చేశారు. పుతిన్​ నిర్లక్ష్య ధోరణితో ఐరోపాకే ముప్పు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు.

జెలెన్​స్కీకి బైడెన్ ఫోన్​..

ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రమైన జపోరిజ్జియా ఎన్​పీపీపై రష్యా దాడులు చేసిన క్రమంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. న్యూక్లియర్​ ప్లాంట్​ సమీపంలో కాల్పుల విరమణ చేయాలని, అగ్నిమాపక దళాలు, అత్యవసర స్పందన దళాలను అనుమతించాలని రష్యాను కోరినట్లు శ్వేతసౌధం తెలిపింది.

మరోవైపు.. జెలెన్​స్కీతో కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో సైతం మాట్లాడారు. న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​పై దాడి చేసిన రష్యా చర్యలను ఖండించారు. ఆమోద యోగ్యంకాని ఇలాంటి దాడులను వెంటనే మానుకోవాలని రష్యాకు సూచించారు.

పుట్టినప్పుడు పిల్లలు ఏడుస్తారు.. మరి పుతిన్‌?

ట్విటర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ వార్తలే కాదు.. అధ్యక్షుడు పుతిన్‌పై బోలెడు హాస్యోక్తులు కూడా చక్కర్లు కొడుతున్నాయి. నెట్టింట వీటిని చదువుతున్నవారు అధిక సంఖ్యలోనే ఉంటున్నారు. ఆ జోక్స్‌లో కొన్ని..

పుతిన్​పై నెట్టింట జోకులు

ఇవీ చూడండి :

Last Updated : Mar 4, 2022, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details