ukraine soldiers marriage: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌కు, రష్యాకు మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇతంటి భయానక వాతావరణంలోనూ ఓ ఆసక్తికరమైన సంఘటన ఉక్రెయిన్ సైన్యంలో జరిగింది.
ఏం జరిగిందంటే?
ukraine soldiers marriage: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌కు, రష్యాకు మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇతంటి భయానక వాతావరణంలోనూ ఓ ఆసక్తికరమైన సంఘటన ఉక్రెయిన్ సైన్యంలో జరిగింది.
ఏం జరిగిందంటే?
రష్యా భీకర కాల్పుల మధ్య ఉక్రెయిన్ యుద్ధభూమిలో.. పెళ్లి భాజాలు మోగాయి. కీవ్‌లో రష్యా సేనలతో పోరాడుతున్న 112 బ్రిగేడ్‌కు చెందిన ఉక్రెయిన్ సైనికులు లెసియా, వాలెరీ రణ క్షేత్రంలోనే.. వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు.. కాల్పుల మోత మధ్యే సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు. వీరి వివాహం జరుగుతుండగా రష్యా సైనికులు విన్నిట్సియా విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: జెలెన్‌స్కీకి మోదీ ఫోన్.. ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై చర్చ