పెంపుడు జంతువులతో పోలింగ్ కేంద్రాలకు బ్రిటన్ ఓటర్లు పెంపుడు జంతువులపై అమితాసక్తి కలిగిన దేశాల్లో బ్రిటన్ ఒకటి. ఈ ఆసక్తిని కనబరుస్తూ ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సార్వత్రిక ఎన్నికల ఓటింగ్‌కు తన పెంపుడు కుక్కతో వచ్చారు. లండన్ వెస్ట్‌మినిస్టర్ నియోజకవర్గంలోని మెథొడిస్ట్ సెంట్రల్ హాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోరిస్ సతీమణి కేరీ సైమండ్స్ తనతో పాటు ఓటు వేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎనిమల్ వేల్స్ అనే చారిటీ నుంచి ఈ పెంపుడు కుక్కను దత్తత తీసుకున్నారు.
లండన్ మేయర్ సాదిక్ ఖాన్ తన పెంపుడు కుక్కతో కలిసి ఓటింగ్ కేంద్రానికి వెళ్లిన వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రజలందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థించారు.
#డాగ్స్ఎట్పోలింగ్స్టేషన్స్
ఇలా నేతలు తమ కుక్కలతో పోలింగ్ స్టేషన్లో దర్శనమిచ్చిన అనంతరం ప్రజలూ తమ పెంపుడు జంతువులతో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వినూత్న దుస్తులతో అలంకరించిన తమ పెంపుడు జంతువుల చిత్రాలను ప్రజలు సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. దీంతో ట్విట్టర్లో "#డాగ్స్ఎట్పోలింగ్స్టేషన్స్" అనే హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది.
డాగ్స్ ట్రస్ట్ సూచనలు
పెంపుడు జంతువులను తీసుకెళ్తున్న ఓటర్లకు డాగ్స్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ పలు సూచనలు చేసింది. అసిస్టెంట్ కుక్కలు కాకుండా మిగితా శునకాలను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదని తెలిపింది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లినప్పుడు బయట తమ పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ఒకరిని వెంటతెచ్చుకోవాలని సూచించింది. రాత్రివేళ ఓటింగ్‌కు వచ్చినప్పుడు వెలుతురు ప్రతిబింబించే దుస్తులను ధరించాలని పేర్కొంది.
ఇదీ చూడండి: ఇన్ఫోసిస్‌కు ఐరాస 'క్లైమేట్ న్యూట్రల్ నౌ' అవార్డు