తెలంగాణ

telangana

ETV Bharat / international

భారతీయులకు చౌకగా, సులభంగా బ్రిటన్​ వీసాలు!

Uk visas to indians: చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయాలంటే భారత్‌కు మరింత స్నేహ హస్తం అందించాలని బ్రిటన్ భావిస్తోంది. ఈ క్రమంలో.. తమ దేశానికి వచ్చే భారతీయులకు మరింత చౌకగా, సులభంగా వీసాలు జారీ చేసే యోచనలో ఆ దేశ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌ను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) ఒప్పించడానికి యూకే ఈ మినహాయింపులను ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.

Uk visas to indians
భారతీయులకు బ్రిటన్​ వీసా

By

Published : Jan 2, 2022, 7:42 AM IST

Uk visas to indians: తమ దేశానికి వచ్చే భారతీయులకు మరింత చౌకగా, సులభంగా వీసాలు జారీ చేసే యోచనలో బ్రిటన్‌ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా పర్యటకులు, విద్యార్థులు, వృత్తి నిపుణులకు సంబంధించి పలు నిబంధనలను సడలించవచ్చని సమాచారం. భారత్‌ను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) ఒప్పించడానికి యూకే ఈ మినహాయింపులను ప్రతిపాదించే అవకాశం ఉందని 'ది టైమ్స్‌' పత్రిక పేర్కొంది. ప్రతిపాదిత ఎఫ్‌టీఏపై సంప్రదింపులను ప్రారంభించేందుకు బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి ఆన్‌ మేరీ ట్రైవిల్యాన్‌ ఈ నెలలో దిల్లీని సందర్శించనున్నారు. తమ పౌరులపై విధిస్తున్న పలు వలస నిబంధనలను సడలించాలన్న భారత దేశ చిరకాల డిమాండ్‌ను ఈ సందర్భంగా బ్రిటన్‌ ఆమోదించవచ్చని ఆ పత్రిక అభిప్రాయపడింది.

India uk trade deal: మేరీ ట్రైవిల్యాన్‌ వెంట దిల్లీ వెళ్లనున్న బ్రిటన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి లిజ్‌ ట్రస్‌ కూడా భారత్‌తో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నారు. చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయాలంటే భారత్‌కు మరింత స్నేహ హస్తం అందించాలన్నది లిజ్‌ ట్రస్‌ అభిప్రాయం. పస్తుతం బ్రిటన్‌కు వెళ్లే భారతీయ పౌరుల నుంచి వర్క్‌ వీసా అయితే రూ.1.40లక్షలకు పైగా (1400 పౌండ్లు), విద్యార్థుల వీసా కోసం రూ.35వేలకు పైగా (348 పౌండ్లు), టూరిస్టు వీసాకు రూ.9,500కు పైగా(95 పౌండ్లు) రుసుములను వసూలు చేస్తున్నారు. ఇవే వీసాలకు చైనా పౌరుల నుంచి వసూలు చేస్తున్న రుసుములు చాలా తక్కువగా ఉంటున్నాయి. భారతీయుల నుంచి వసూలు చేస్తున్న రుసుములను కూడా తగ్గించాలని భారత సంతతికి చెందిన పలువురు బ్రిటన్‌ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details