తెలంగాణ

telangana

ETV Bharat / international

వేగంగా వ్యాపిస్తున్న బ్రిటన్‌ వైరస్‌- మరణ ముప్పు తక్కువే! - బ్రిటన్​ కొత్తరకం కరోనా వైరస్​

బ్రిటన్​లో కనుగొన్న బి.1.1.7. రకం వైరస్.. వేగంగా సోకుతోందని బ్రిటన్ పరిశోధకులు తేల్చారు. చైనాలోని వుహాన్‌లో తొలిసారి వెలుగుచూసిన వైరస్‌తో పోల్చితే దీని వైరల్‌ లోడు, ఇన్‌ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉంటోందని గుర్తించారు. అయితే ఈ వైరస్​వల్ల మరణం, తీవ్ర అనారోగ్యం ముప్పు తక్కువేనని స్పష్టం చేశారు.

uk variant
వేగంగా బ్రిటన్​ వైరస్

By

Published : Apr 14, 2021, 8:53 AM IST

బ్రిటన్‌లో గుర్తించిన బి.1.1.7. రకం కరోనా వైరస్‌.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని, అయితే దీని కారణంగా బాధితులు మరణించేంతటి తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు మాత్రం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్‌కు చెందిన 37 వేల మంది వైరస్‌ బాధితులు క్వారంటైన్‌లో ఉంటూ కొవిడ్‌ యాప్‌ ద్వారా తమ లక్షణాలను తెలియజేశారు. గత ఏడాది సెప్టెంబరు-డిసెంబరు మధ్య సేకరించిన ఈ డేటాను నిపుణులు విశ్లేషించారు. బి.1.1.7. రకం వైరస్‌ మార్పులకు గురికాలేదని, దీని కారణంగా కొవిడ్‌ లక్షణాలు సుదీర్ఘకాలం ఉండటం లేదని తేల్చారు.

చైనాలోని వుహాన్‌లో తొలిసారి వెలుగుచూసిన వైరస్‌తో పోల్చితే దీని వైరల్‌ లోడు, ఇన్‌ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉంటోందని గుర్తించారు. తీవ్రస్థాయి అనారోగ్యం, మరణ ముప్పునకు కారణమయ్యే ఇతర రకాల వైరస్‌లకు ఇది భిన్నమైనదని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ హాస్పిటల్స్‌ పరిశోధకుడు ఎలెని నాస్టౌలీ చెప్పారు. ద లాన్సెట్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ అండ్‌ ద లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ జర్నళ్లు దీన్ని ప్రచురించాయి.

ABOUT THE AUTHOR

...view details