బ్రిటన్‌లో కరోనా టీకాను ఎక్కువ మంది వేసుకునేలా డేటింగ్ యాప్స్ ప్రచారం కల్పిస్తున్నట్లు వెల్లడించాయి. ఇందుకోసం తాము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి.
యూజర్లు డేటింగ్ ప్రొఫైల్స్‌లో టీకాకు తమ మద్దతును చూపించడానికి ప్రత్యేక ఫీచర్ తీసుకువస్తున్నట్లు యాప్ నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆ ఫీచర్లో టీకాలు వేసుకున్నట్లు తెలిపితే వారికి బోనస్‌లు ఇస్తామని ప్రకటించారు.
ఇదే అంశంపై సర్వే నిర్వహించగా... వాక్సిన్ వేయించుకున్న వారితో డేట్‌కు వెళ్లడానికి 31 శాతం మంది అంగీకరించారు. టీకా వేసుకోకపోతే డేటింగ్‌కు వెళ్లే ప్రసక్తేలేదని మరో 28 శాతం మంది వెల్లడించారు.
బ్రిటన్‌లో సుమారు కోటి మంది ప్రజలు డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారు. తాజా అధికారిక గణాంకాల ప్రకారం యూకేలో 4 కోట్లకు పైగా ప్రజలు, లేదా మూడొంతుల మంది పెద్దలు తొలి డోసు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఇదీ చదవండి:Third Wave of Corona: అక్కడ మూడో ఉద్ధృతి!