కరోనా పుట్టుకకు సంబంధించిన అధ్యయనాన్ని సకాలంలో పారదర్శకంగా పూర్తి చేసే ప్రక్రియకు మద్దతునిస్తున్నట్లు అమెరికా, బ్రిటన్లు ప్రకటించాయి. జీ-7 సమ్మిట్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ల మధ్య జరిగిన భేటీ అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
అమెరికా-బ్రిటన్ల మధ్య.. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, భద్రత, విజ్ఞానం, ఆవిష్కరణలు, ఆర్థిక శ్రేయస్సులో సహకారం మరింతగా పెంచుకోనున్నట్లు ఇరువురు నేతలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. అలాగే.. వాతావరణ మార్పు, జీవవైవిధ్యానికి వాటిల్లుతున్న నష్టం, విస్తురిస్తున్న ఆరోగ్య ముప్పు అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను పరస్పర సహకారంతో పరిష్కరించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి:వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా- 'అగ్రరాజ్యం' నివేదిక!