తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​ను రెండు రోజులు అడ్డుకునే నాసల్​ స్ప్రే - కరోనా నుంచి రక్షణ కల్పిచే నాసల్​ స్ప్రే

కరోనా మహమ్మారి నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేలా ఒక 'నాసల్​ స్ప్రే'ను బ్రిటన్​ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ఔషధాన్ని తీసుకుంటే రెండు రోజుల పాటు రక్షణ లభిస్తుందని వారు చెబుతున్నారు.

nasla spray covid blocker
కొవిడ్​ను రెండు రోజులు అడ్డుకునే నాసల్​ స్ప్రే

By

Published : Jan 25, 2021, 7:57 AM IST

కరోనా వైరస్​ ఇన్​ఫెక్షన్​ను కనీసం రెండు రోజుల పాటు నిరోధించే ఒక నాసల్​ స్ప్రేను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దీన్ని ముక్కులో వేసుకుంటే మహమ్మారి నుంచి తాత్కాలికంగా రక్షణ లభిస్తుంది. ఈ మందును భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొద్ది నెలల్లోనే అది ఔషధ దుకాణాల్లో అందుబాటులోకి వస్తుంది. బ్రిటన్​లోని బర్మింగ్​హామ్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. భౌతిక దూరానికి సంబంధించిన నిబంధనల నుంచి ఇది సమాజానికి ఉపశమనం కల్పిస్తుందని పరిశోధనకు నాయకత్వం వహించిన రిచర్డ్​ మోక్స్​ తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి వీలు కల్పిస్తుందన్నారు.

ఇప్పటికే అనుమతి పొందిన పదార్థాలతో దీన్ని అభివృద్ధి చేశారు. అందువల్ల దీన్ని సురక్షితంగా వాడొచ్చని, ఎలాంటి అనుమతులూ అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ముక్కులోకి చేరిన వైరస్​ను ఈ ఔషధం పట్టేస్తుంది. దాన్ని ఒక పూతలో బంధించేస్తుంది. అందువల్ల ఇన్​ఫెక్షన్​ కలిగించలేదు. సదరు వ్యక్తి నుంచి మరో వ్యక్తిలోకి ప్రవేశించినప్పటికీ అతడిలోనూ అది ఇన్​ఫెక్షన్​ కలిగించలేదు. 48 గంటల పాటు ఇది కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణ రక్షణ కోసం రోజుకు నాలుగుసార్లు ఈ స్ప్రేను వాడితే సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చూడండి:చిన్నారుల కళ్లకు శానిటైజర్ల ముప్పు!

ABOUT THE AUTHOR

...view details