కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచ దేశలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టీకాను అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాయి. తాజాగా.. క్షయ వ్యాధితో పోరాడేందుకు గతంలో వినియోగించిన బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్టె-గ్యురిన్) వ్యాక్సిన్.. కరోనాకు ఉపయోగపడుతుందా? లేదా? అనే అంశంపై బ్రిటన్ పరిశోధనలు చేపట్టనుంది. ఇందుకోసం ఆరోగ్య కార్యకర్తలను నియమించుకునే పనిలో ఉంది.
ఈ పరిశోధనలకు.. నైరుతి ఇంగ్లాండ్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయం నేతృత్వం వహిస్తోంది. బ్రేస్ (బీసీజీ వ్యాక్సినేషన్ టు రెడ్యూస్ ది ఇంపాక్ట్ ఆఫ్ కొవిడ్-19 ఇన్ హెల్త్ వర్కర్స్) పేరుతో ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది.
"కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలమందిని బలిగొంది. 3 కోట్లమందికిపైగా దీని బారినపడ్డారు. సాధారణ పరిస్థితుల్లో బీసీజీ.. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందన్నది తెలిసిన విషయమే. కరోనాపైనా ఇది ప్రభావం చూపుతుందని మేము అనుకుంటున్నాం. దీనిపై భారీ స్థాయిలో పరిశోధనలు చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాం. ఇది ఫలిస్తే.. తక్కువ ఖర్చుతోనే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు."