కొవిడ్-19 నుంచి తక్షణ, దీర్ఘకాల రక్షణ కల్పించే వినూత్న యాంటీబాడీ ఔషధ చికిత్సకు బ్రిటన్ శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా.. "లాంగ్ యాక్టింగ్ యాంటీబాడీ(ఎల్ఏఏబీ)లను అభివృద్ధి చేసింది. వీటితో కరోనా సోకినవారికి చికిత్స అందించడం ద్వారా, వారిలో కొవిడ్ ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందకుండా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు." ఎల్ఏఏబీ చికిత్స ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా తక్షణం రక్షణ కల్పిస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి:ఎందుకు కొవిడ్-19 అని పిలుస్తారు?
ఇంజెక్షన్ చికిత్స..
యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్స్ (యూసీఎల్‌హెచ్) ట్రస్ట్ వైరాలజీ నిపుణుడు డా.కేథరిన్ హౌలిహన్ బృందం ఈ వినూత్న చికిత్సను రూపొందించింది. "ఎల్ఏఏబీ యాంటీబాడీలు వైరస్‌ను అచేతనంగా మారుస్తాయి. ఇంజెక్షన్ ద్వారా ఈ చికిత్స అందించొచ్చు. వృద్ధాప్యం, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి సమస్యల కారణంగా కొందరి రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఇమ్యునో కాంప్రమైజ్డ్ పేషెంట్లుగా పిలిచే ఇలాంటి బాధితుల రోగ నిరోధక వ్యవస్థ వ్యాక్సిన్లకు స్పందించదు. కానీ వీరికి కూడా కొవిడ్ నుంచి రక్షణ కల్పించేందుకు ఎల్ఏఏబీ యాంటీ బాడీ చికిత్స దోహదపడుతుంది. ప్రస్తుతం దీనిపై క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి" అని కేథరిన్ వివరించారు.
ఇదీ చదవండి:కొత్త వైరస్‌పై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సమీక్ష