తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రాజెనెకా టీకాకు బ్రిటన్​ ఆమోదం - బ్రిటన్​ వ్యాక్సిన్​

UK regulator approves Oxford/AstraZeneca COVID-19 vaccine.
ఆస్ట్రాజెనెకా టీకాకు బ్రిటన్​ ఆమోదం

By

Published : Dec 30, 2020, 12:47 PM IST

Updated : Dec 30, 2020, 1:57 PM IST

12:45 December 30

ఆస్ట్రాజెనెకా టీకాకు బ్రిటన్​ ఆమోదం

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ​, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ వినియోగానికి బ్రిటన్​ ఆమోదం తెలిపింది. ఈ టీకా సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని అక్కడి ఆరోగ్య సంరక్షణ,  ఔషధ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ(ఎంహెచ్​ఆర్​ఏ) వెల్లడించింది. 

"ఈ టీకాను 4 నుంచి 12 వారాల వ్యత్యాసంతో రెండు డోసులు ఇవ్వాలి. కరోనాను నివారించడంలో ఈ టీకా సురక్షితంగా, సమర్థవంతంగా పని చేస్తోందని తేలింది. రెండో డోసు ఇచ్చిన 14 రోజుల తర్వాత కూడా ఎలాంటి తీవ్రమైన సమస్యలు కనిపించలేదు." అని ఆస్ట్రాజెనెకా టీకాకు ఆమోదం తెలిపిన బ్రిటన్​ అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.

యూకే వ్యాప్తంగా మొత్తం 10కోట్ల డోసుల టీకా సరఫరాకు ఆ దేశం ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి 4కోట్ల డోసులను సరఫరా చేయనున్నారు అధికారులు.

ఇది బ్రిటన్​ విజయం

ఆస్ట్రాజెనెకా టీకాకు ఆమోదంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తంచేశారు. దీనిని బ్రిటన్​ శాస్త్రసాంకేతిక రంగం సాధించిన విజయంగా అభివర్ణించారు. సాధ్యమైనంత మందికి టీకా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి:కొత్త రూల్​- చిన్న పిల్లలకు కేక్, ఐస్​క్రీమ్​ బంద్!

Last Updated : Dec 30, 2020, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details