బ్రిటిష్ చరిత్రలోనే అతిపెద్ద ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ నేటి నుంచి ప్రారంభించనుంది. ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకాను నేటి నుంచి ప్రజలకు ఇవ్వనుంది. అత్యంత శీతల కంటైనర్లలో టీకాలను ఇప్పటికే యూకేలోని వివిధ ప్రాంతాలకు చేరవేశారు. సరఫరా పరిమితుల కారణంగా మొదటదశలో అత్యంత ప్రమాదంలో ఉన్న వర్గాలకే టీకా ఇవ్వనున్నారు.
నేటి నుంచి బ్రిటన్‌లో వ్యాక్సిన్ పంపిణీ - బ్రిటన్ కరోనా వ్యాక్సిన్
టీకా పంపిణీకి బ్రిటన్ సర్కార్ సిద్ధమైంది. ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో.. టీకా తొలి డోసులను దిగుమతి చేసుకుంది. ఎంపిక చేసిన 50 ప్రభుత్వ ఆస్పత్రులలో ఈరోజు టీకా పంపిణీ మొదలు కానుంది.
నేటి నుంచి బ్రిటన్‌లో వ్యాక్సిన్ పంపిణీ
నర్సింగ్ హోమ్‌లలో ఉండే పౌరులు, వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి తొలి దశలో టీకా ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వంనిర్ణయించింది. బ్రిటన్ ప్రజలందరికీ కొవిడ్ టీకా ఇవ్వాలంటే కొన్నినెలలు పడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొవిడ్ విపత్తును కళ్లారా చూసిన.. బ్రిటిష్ వయోవృద్ధులు తమకు ముందుగా టీకా వేయించేందుకు ప్రభుత్వం చొరవచూపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు