జిరాఫీతో కలిసి భోజనం చేయాలనుందా?...లండన్‌లోని 'ల్యాండ్ ఆఫ్ ది లయన్స్' లాడ్జ్‌లో ఒకరోజు రాత్రి గడిపితే చాలు.. మీ కల తీరుతుంది. ఇక్కడ పెగ్విన్లతో కలిసి అల్పాహారం చెయ్యవచ్చు. సౌకర్యవంతమైన గదులతో మీకు అక్కడి లాడ్జీలు స్వాగతం పలుకుతాయి. ఇక్కడున్న 9 లాడ్జీలకు వివిధ జంతువుల పేర్లను పెట్టారు. ప్రత్యేకమైన వరండా, స్నానపు గదులను ఏర్పాటు చేశారు. దాదాపు 20వేల రకాల జంతువుల ధ్వనులను ఇక్కడ మీరు రాత్రిపూట వింటారు. లాడ్జ్‌లో ఒక రోజు గడపాలంటే ఇద్దరికి కలిపి 378 యూరోస్ (దాదాపు రూ. 29 వేలు) ఖర్చవుతుంది. అదే పిల్లలతో కలిసి వెళ్తే అదనంగా 50 యూరోస్ చెల్లించాల్సి ఉంటుంది.
"ఇది అద్భుతమైన అనుభవం. ఎందుకంటే మీరు 'జూ'ని చూసే విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. జంతువులు సాయంత్రం వేళల్లో వస్తాయి, ముఖ్యంగా సింహాలు సూర్యుడు అస్తమించే సమయంలో చురుకుగా ఉంటాయి. మీరు జూ చుట్టూ ఉన్న అన్ని శబ్దాలను వినవచ్చు. అలాగే రీజెంట్ పార్క్ నడిబొడ్డున ఉంటాము కనుక ఉదయం కూడా ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు రకరకాల పక్షులు శబ్దాలన్నీ ఉదయం లేవగానే వినవచ్చు"
-జాయ్ హాడ్ఫీల్డ్, పార్కు నిర్వాహకురాలు