తెలంగాణ

telangana

ETV Bharat / international

చివరి ప్రయత్నాల్లో థెరిసా మే! - కన్జర్వేటివ్​ పార్టీ

చివరి నిమిషంలో బ్రిటన్​ పార్లమెంట్​లో బ్రెగ్జిట్​పై తన ప్రతిపాదనలకు మద్దతు కూడగట్టడానికి ప్రధాని థెరిసా మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తర ఐర్లాండ్​కి చెందిన డెమొక్రాటిక్​ యూనియనిస్ట్​ పార్టీ మద్దతుతో గట్టెక్కాలని భావిస్తున్నారు.

థెరిసా మే, బ్రిటన్​ ప్రధాని

By

Published : Mar 18, 2019, 5:44 PM IST

Updated : Mar 19, 2019, 7:56 PM IST

చివరి నిమిషంలో తన 'బ్రెగ్జిట్​' ప్రతిపాదనను పార్లమెంట్​లో గెలిపించుకోవడానికి బ్రిటన్​ ప్రధాని థెరిసా మే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉత్తర ఐర్లాండ్​కు చెందిన డెమొక్రాటిక్​ యూనియనిస్ట్​ పార్టీ (డీయూపీ) మద్దతుతో తన ప్రతిపాదనను గట్టెక్కించాలని భావిస్తున్నారు. యూరోపియన్​ యూనియన్​ నుంచి బ్రెగ్జిట్​తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండా వైదొలిగితే బ్రిటన్​కే నష్టమని ఆమె చెబుతున్నారు.

గత రెండు సార్లు థెరిసా మే ప్రతిపాదనలను బ్రిటన్ పార్లమెంట్​ తిరస్కరించింది. ఇందుకు ప్రధాన కారణం కన్జర్వేటివ్​ పార్టీకి, డీయూపీకి చెందిన 10 మంది సభ్యుల మద్దతు లేకపోవడమే. ఇప్పుడు థెరిసా మేకి మరో ఓటమి ఎదురుకాకుండా ఉండాలంటే డెమొక్రాటిక్​ యూనియన్​ పార్టీ మద్దతు తప్పనిసరి. అయితే ప్రతిపక్షం మాత్రం తమ గెలుపుపై ధీమాగా ఉంది. ఉత్తర ఐర్లాండ్, రిపబ్లిక్​ ఆఫ్​ ఐర్లాండ్​ మధ్య ఎలాంటి విభేదం లేదని చెబుతోంది.

అయితే థెరిసా మేకు మద్దతు ఇవ్వడానికి మాజీ బ్రిటన్ విదేశాంగ మంత్రి బోరిస్​ జాన్సన్​ తిరస్కరించారు. మే ప్రతిపాదనలో మరిన్ని మార్పులు అవసరమని వెల్లడించారు.

Last Updated : Mar 19, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details