తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్ ప్రధాని బోరిస్ దంపతులకు పండంటి ఆడబిడ్డ - భారత్​పై బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యలు

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య క్యారీ సైమండ్స్ ఆడపిల్లకు జన్మినిచ్చారు. వారిద్దరికీ ఇది రెండో సంతానం. క్రిస్మస్​ సందర్భంగా తమ ఇంటికి "రెయిన్‌బో బేబీ" వచ్చిందని బోరిస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

boris johnson
బోరిస్ జాన్సన్

By

Published : Dec 9, 2021, 4:14 PM IST

Updated : Dec 9, 2021, 6:07 PM IST

Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి క్యారీ సైమండ్స్​ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తమకు లండన్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని ఓ ఆసుపత్రిలో శిశువు జన్మించిందని.. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు విల్​ఫ్రెడ్ అనే చిన్నారికి జన్మనిచ్చారు. ప్రస్తుత సంతానంతో కలిపి 57 ఏళ్ల జాన్సన్​కు ఏడుగురు సంతానం ఉన్నారు.

క్రిస్మస్​ సందర్భంగా తమ ఇంటికి "రెయిన్‌బో బేబీ" వచ్చిందని బోరిస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

భారత సంతతికి చెందిన మాజీ భార్య మెరీనా వీలర్‌తో విడాకులు తీసుకున్న అనంతరం క్యారీని మూడో వివాహం చేసుకున్నారు జాన్సన్​. ఈ ఏడాది ప్రారంభంలో క్యారీ జాన్సన్​కు గర్భస్రావం జరిగింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఆ సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఐదో శిశువు..

గత 170 ఏళ్లలో పదవిలో ఉన్న ఓ బ్రిటిష్ ప్రధానికి జన్మించిన ఐదో శిశువుగా జాన్సన్ కుమార్తె రికార్డులకెక్కింది.

  • టోనీ బ్లెయిర్ పదవిలో ఉన్న సమయంలోనే ఆయన సతీమణి 2000 మేలో లియోకు జన్మనిచ్చారు.
  • డేవిడ్ కామెరాన్ భార్య సమంతా.. ఫ్లోరెన్స్‌ అనే కుమార్తెతు జన్మనిచ్చారు.
  • 19వ శతాబ్దంలో ప్రధానమంత్రిగా పనిచేసిన లార్డ్ జాన్ రస్సెల్ దంపతులు పదవిలో ఉండగానే ఒక బిడ్డకు జన్మనిచ్చారు.
  • గతేడాది ఏప్రిల్‌లో జాన్సన్​-క్యారీ దంపతులు విల్​ఫ్రెడ్ అనే చిన్నారికి జన్మనిచ్చారు.

ఈ ఏడాది మే నెలలో 56ఏళ్ల బోరిస్‌ జాన్సన్‌.. తన ప్రేయసి క్యారీ సైమండ్స్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 9, 2021, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details