తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కట్టడికి బ్రిటన్​లో సరికొత్త లాక్​డౌన్​ వ్యవస్థ - బ్రిటన్ లాక్​డౌన్

బ్రిటన్​లో సరికొత్త లాక్​డౌన్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ప్రకటించారు ప్రధాని బోరిస్ జాన్సన్​. కేసుల తీవ్రతకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో మూడు విధానాల్లో లాక్​డౌన్ ఆంక్షలు విధించనున్నట్టు పేర్కొన్నారు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న మార్చి నెల కంటే ఇప్పుడు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

UK PM unveils 3-tier Covid-19 alert system
కరోనా కట్టడికి బ్రిటన్​లో సరికొత్త లాక్​డౌన్​ వ్యవస్థ

By

Published : Oct 13, 2020, 2:49 PM IST

బ్రిటన్​లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వేసవి కాలంలో తగ్గుముఖం పట్టిన కేసులు.. శీతాకాలం మొదలయ్యేసరికి విపరీతంగా పెరుగుతున్నాయి. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న మార్చి నెల కంటే ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యే అధికంగా ఉండటం పట్ల ప్రధాని బోరిస్ జాన్సన్​ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త లాక్​డౌన్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆయా నగరాల్లో మూడు విధానాల్లో లాక్​డౌన్​ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న నిబంధనలను అర్థం చేసుకునేందుకు క్లిష్టంగా ఉన్నందు వల్లే కొత్త విధానాలు రూపొందించినట్లు వివరించారు.

  • కరోనా తీవ్రత ఆధారంగా మీడియం, హై, వెరీ హై అనే మూడు స్థాయిల్లో హెచ్చరిక వ్యవస్థను రూపొందించింది ప్రభుత్వం. మీడియం స్థాయిలో ప్రస్తుత నిబంధనలే అమల్లో ఉంటాయని బోరిస్​ చెప్పారు. ఈ ప్రాంతాల్లో ఆరుగురి కంటే ఎక్కువ మంది గుమికూడేందుకు వీల్లేదు. 10మందికి మించి ఆతిథ్యం ఇవ్వొద్దు.
  • 'హై' లెవెల్​ ఆంక్షలు ప్రస్తుత లాక్​డౌన్​ నిబంధనల్లాగే ఉంటాయి. ఇంగ్లాండ్​ వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వీటి ప్రకారం ఒకరి ఇంట్లోకి మరొకరు కుటుంబంతో వెళ్లడనికి వీల్లేదు.
  • వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 'వెరీ హై' స్థాయి ఆంక్షలు అమలు చేస్తారు. ఈ ప్రాంతాల్లో బార్లు, పబ్బులకు అనుమతి లేదు. ప్రజలు ఇతరుల ఇళ్లకు, ప్రైవేట్ గార్డెన్లకు వెళ్లడానికి వీల్లేదు. ఇతర ప్రాంతాలకు ప్రయాణించకూడదు.

కరోనా కేసులు అధికంగా ఉన్న లివర్​పూల్ నగరంలో బుధవారం నుంచి 'వేరీ హై' లాక్​డౌన్​ను అమలు చేయనున్నట్లు బోరిస్ తెలిపారు.

బ్రిటన్​లో సోమవారం కొత్తగా 13,972 కేసులు వెలుగు చూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,17,688కి చేరింది. ఇప్పటివరకు 42,965మంది వైరస్​కు బలయ్యారు.

ABOUT THE AUTHOR

...view details