తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రమాదానికి గురైన 'ప్రధాని' కారు.. తప్పిన ముప్పు

బ్రిటన్​లో జరుగుతున్న నిరసనల సెగ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​కు తగిలింది. పార్లమెంట్​ నుంచి వెళుతున్న కాన్వాయ్​పైకి ఆందోళనకారులు దూసుకొచ్చిన క్రమంలో బోరిస్​ కారు ప్రమాదానికి గురైంది. అయితే.. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు.

UK PM unhurt in car crash
ప్రమాదానికి గురైన 'ప్రధాని' కారు

By

Published : Jun 18, 2020, 6:15 AM IST

బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​ కారు ప్రమాదానికి గురైంది. లండన్​లోని పార్లమెంట్​ గేటు సమీపంలో ప్రధాని కాన్వాయ్​ వెళుతున్న సమయంలో నిరసనకారులు ఒక్కసారిగా కాన్వాయ్​ వైపు దూసుకు రావటం వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

" భద్రత చర్యల్లో భాగంగా రక్షణ వాహనాలు వెళ్తున్నాయి. ఓ వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావటం వల్ల వాహనాలు ఒక్కసారిగా నిలిపివేయాల్సి వచ్చింది. దాంతో రెండు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి హాని జరగలేదు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం."

- పోలీసులు

ప్రతి వారం నిర్వహించే ప్రశ్నోత్తరాల సెషన్స్​కు ప్రధాని హాజరై తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు డౌనింగ్​ స్ట్రీట్​ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో జాన్సన్​ కారు ధ్వంసమైన ఫొటోలు వైరల్​గా మారిన క్రమంలో ఈ మేరకు స్పందించింది డౌనింగ్​ స్ట్రీట్​.

ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఇదీ చూడండి: సరిహద్దులో గస్తీ కాస్తున్న త్రివిధ దళాలు 'హై అలర్ట్​'

ABOUT THE AUTHOR

...view details