తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదంపై నెలకొన్న ప్రతిష్టంభనను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భారత్-చైనాలకు సూచించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. రెండు దేశాల మధ్య వివాదంపై బ్రిటన్ సభలో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఫ్లిక్ డ్రుమోండ్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు. భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు అత్యంత ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు బోరిస్. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు.
భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు ఆందోళనకరం: బోరిస్ - British Prime Minister latest news
సరిహద్దు వివాదంపై తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అత్యంత ఆందోళనకరమన్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్స్‌న్. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు ఆందోళనకరం: బోరిస్
వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్-చైనా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇరు దేశాల మధ్య దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. అనంతరం.. లద్దాఖ్‌లో శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు గతంలో కుదరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు అంగీకరించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. రెండు దేశాలు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించుకోనునట్లు పేర్కొంది.