తెలంగాణ

telangana

ETV Bharat / international

జి-7 సదస్సును ప్రారంభించిన బ్రిటన్ ప్రధాని - జి-7 సదస్సులో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జి-7 శిఖరాగ్ర సమావేశాన్నిశుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చేసిన ప్రారంభోపన్యాసంలో ప్రపంచమంతా మహమ్మారి నుంచి పాఠాలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

uk pm
బ్రిటన్ ప్రధాని

By

Published : Jun 12, 2021, 5:12 AM IST

ప్రపంచ నాయకులంతా మహమ్మారి విసిరిన సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో ఈ కలయిక అద్భుతమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జి-7 శిఖరాగ్ర సదస్సుకు బ్రిటన్ ఆతిథ్యమిస్తోంది.

"ఈ సమావేశం జరిగి తీరాల్సిందేనని భావిస్తున్నా. ఎందుకంటే మనమంతా కరోనా నుంచి పాఠాలు నేర్చుకున్నామని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. గత 18 నెలల్లో చేసిన కొన్ని తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అంతేగాక ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి."

ABOUT THE AUTHOR

...view details