తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఉక్రెయిన్​లో శాంతి కోసం కలిసి పనిచేద్దాం'.. మోదీతో బోరిస్​ జాన్సన్​

Russia-Ukraine Conflict: రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంపై కూలంకషంగా చర్చించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్. పోరు ఆపాలని, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ పదేపదే విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు.

Boris Johnson
pm narendra modi

By

Published : Mar 23, 2022, 5:42 AM IST

Russia-Ukraine Conflict: రష్యా దండయాత్ర వేళ.. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి భారత్‌ తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు, పుతిన్‌ చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీతో జాన్సన్​ ఫోన్‌లో చర్చించారు. ఉక్రెయిన్‌ అంశంలో పుతిన్‌ చర్యలు.. అంతర్జాతీయంగా తీవ్ర ముప్పునకు దారితీసే ప్రమాదం ఉందని జాన్సన్‌ అన్నారు.

ప్రపంచశాంతి, శ్రేయస్సును కాపాడడానికి అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించడమే ఏకైక మార్గమని ఇరువురు నేతలు అంగీకరించినట్లు బ్రిటన్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రష్యా.. ఐరాస చార్టర్‌కు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి.

చర్చలే పరిష్కారం..

ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి సామరస్యంగా చర్చింకోవడమే ఉత్తమమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దీంతో పాటు భారత్​-యూకే మధ్య దౌత్యసంబంధాలపై నేతలు చర్చించారు. సాంకేతికం, పెట్టుబడులు, రక్షణ, వ్యాపార రంగాలకు సంబంధించి చర్చ జరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఆహార సంక్షోభంలోకి ప్రపంచం..

మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు తక్షణమే ముగింపు పలికి, శాంతిస్థాపనకు కృషి చేయాలని ఐరాస జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ అన్నారు. యుద్ధం కారణంగా ప్రపంచం ఆహార సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికే దాదాపు కోటి మంది ఉక్రెయిన్‌ ప్రజలు యుద్ధ భయంతో తమ స్వస్థలాలను విడిచి వెళ్లారని పేర్కొన్నారు. రష్యా క్షిపణి దాడులతో.. ఉక్రెయిన్‌ ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారని గుటెరస్ అన్నారు. ఇప్పటికే.. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచ దేశాలు.. యుద్ధం కారణంగా ఆర్థికంగా చితికిపోయి, భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:మరియుపోల్​పై రష్యా ఉక్కుపాదం.. 10 నిమిషాలకోసారి బాంబుల వర్షం

ABOUT THE AUTHOR

...view details