బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. ఎంపీలకు ఇవనున్న డ్రింక్స్ పార్టీ చర్చనీయాంశమైంది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన రూల్స్ ఇందుకు ప్రధాన కారణం.
ఇంతకీ ఏమైంది?
సొంత పార్టీకి చెందిన సీనియర్ ఎంపీలకు మంగళవారం సాయంత్రం(యూకే కాలమానం ప్రకారం) 10 డౌనింగ్ స్ట్రీట్లో విందు, డ్రింక్స్ పార్టీ ఇవనున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. అయితే పార్టీకి వచ్చే వారంతా.. కొవిడ్ పాస్ తీసుకురావాలని నిబంధన పెట్టారు. అంటే.. రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ లేదా కరోనా నెగెటివ్ రిపోర్ట్ (కొత్తది) ఉండాలనేదే ఈ కొవిడ్ పాస్. కరోనా వేగంగా విజృంభిస్తున్నందున.. కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే దీనిపై పలువురు ఎంపీలు సంతృప్తిగా లేరని ఓ వార్తా సంస్థ కథనం రాసుకొచ్చింది. అదే పార్టీపై కొందరు ఎంపీలు చేసిన వ్యాఖ్యలను ఆ కథనంలో పేర్కొంది.