తెలంగాణ

telangana

ETV Bharat / international

రైతు ఆందోళనలపై బ్రిటన్​ పార్లమెంటులో చర్చ? - స్వీడన్​ పర్యావరణ ఉద్యమం

భారత్​లో రైతు ఆందోళనలు, మీడియా స్వేచ్ఛ అంశాలు.. బ్రిటన్​ పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు అక్కడి పార్లమెంట్​ పిటిషన్స్​ కమిటీకి ఆన్​లైన్​ ఫిర్యాదు అందింది. దీనిపై దాదాపు లక్షా 6 వేల మంది సంతకాలు చేశారు. చర్చ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

By

Published : Feb 4, 2021, 6:28 AM IST

భారత్​లో రైతుల ఆందోళనకు పాప్​ సింగర్​ రిహానా, స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్​బర్గ్‌ సహా అంతర్జాతీయ ప్రముఖుల మద్దతుపై వివాదం సాగుతుండగానే బ్రిటన్‌లోనూ ఈ అంశం చర్చనీయాంశమైంది. భారత్‌లో రైతుల ఆందోళనలు సహా మీడియా స్వేచ్ఛపై చర్చించాలని బ్రిటన్‌ పార్లమెంట్​ పిటిషన్స్​ కమిటీకి లక్షా 6 వేల మంది సంతకాలతో ఆన్‌లైన్‌ పిటిషన్‌ అందింది. సంతకాలు చేసిన వారిలో పలువురు భారత సంతతి పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నారు.

భారత ప్రభుత్వం సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారి రక్షణ సహా మీడియా స్వేచ్ఛ కాపాడేలా చూడాలని ఈ పిటిషన్‌లో అభ్యర్ధించారు. లక్ష మంది సంతకాలతో అభ్యర్ధన అందితే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో తప్పక చర్చించాలి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చకు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ప్రతినిధి తెలిపారు. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు అందిన ఆన్‌లైన్‌ పిటిషన్‌లో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా సంతకం చేశారన్న వార్తలను యూకే ప్రభుత్వం ఖండించింది.

అయితే.. అంతర్జాతీయ మద్దతుపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత అంతర్గత వ్యవహారాలపై ఇతరుల జోక్యం ఎందుకంటూ మండిపడింది. కేంద్ర మంత్రులు అమిత్​ షా, జైశంకర్​ సహా దేశంలోని పలువురు క్రీడాప్రముఖులు, నటులు.. అంతర్జాతీయ సెలబ్రిటీల ట్వీట్లను తప్పుబట్టారు.

ఇదీ చూడండి: రిహానా, గ్రెటా ట్వీట్లకు బాలీవుడ్​ తారల కౌంటర్

ABOUT THE AUTHOR

...view details