తెలంగాణ

telangana

ETV Bharat / international

కొత్త రకం కరోనా మరింత ప్రాణాంతకం: బ్రిటన్​ ప్రధాని

కరోనా కొత్త రకం స్ట్రెయిన్​పై బ్రిటన్​ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది వేగంగా వ్యాపించడమే కాక.. మరింత ప్రాణాంతకం అయ్యుండొచ్చని అన్నారు. పాత కరోనా వైరస్‌తో పోలిస్తే కొత్త రకం స్ట్రెయిన్​ ఎక్కువ ప్రాణాంతకమైందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు బ్రిటన్​ ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్​ వ్యాలన్స్​.

VIRUS-UK-NEW VARIANT
'కొత్త స్ట్రేయిన్​తో మరణించే శాతం ఎక్కువ'

By

Published : Jan 23, 2021, 9:49 AM IST

గతేడాది చివర్లో లండన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి బ్రిటన్​ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక ప్రకటన చేశారు. ఇది వేగంగా వ్యాపించడమే కాకుండా పాత వైరస్‌తో పోలిస్తే ప్రాణాంతకం కూడా అయ్యుండొచ్చని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువయిన తర్వాత మరణాల రేటు పెరిగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు తనకు వివరించినట్లు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం అక్కడ అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాలు అన్ని రకాల కరోనా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్‌ వ్యాలన్స్‌ సైతం ధ్రువీకరించారు. పాత కరోనా వైరస్‌తో పోలిస్తే కొత్త వైరస్‌ ఎక్కువ ప్రాణాంతకమైందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 60 ఏళ్ల వ్యక్తికి ఈ ప్రమాద శాతం 1.3 నుంచి 1.4 శాతం ఉందన్నారు. వెయ్యి కేసుల్లో ఒకరికి ఈ పరిస్థితి ఎదురవుతోందని తెలిపారు. కొత్త స్ట్రెయిన్ ​​వ్యాప్తి 30 నుంచి 70 శాతం ఎక్కువ ఉంటుందన్నారు. అయితే ఈ విషయంపై స్పష్టత కోసం మరింత పరిశోధన చేపట్టాలని అన్నారు.

టీకా ప్రభావం..

బ్రెజిల్​, దక్షిణాఫ్రికాలో కనుగొన్న కొత్త రకం కరోనా నియంత్రణపై శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని వ్యాలన్స్​ పేర్కొన్నారు. ఆ వైరస్​లపై టీకా ప్రభావం చూపకపోవచ్చని భావిస్తున్నారని తెలిపారు. అయితే కొత్త రకం కరోనాపైన కూడా టీకా ప్రభావం చూపిస్తుందని బ్రిటన్​ శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్న సమయంలో వ్యాలన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి :వైట్​హౌస్​కు 'కొత్త' రూల్స్- పక్కాగా అమలు

ABOUT THE AUTHOR

...view details