తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్​కు బ్రిటన్​ దిగువసభ పచ్చజెండా

బ్రెగ్జిట్‌ నూతన ఒప్పందానికి బ్రిటన్​ పార్లమెంట్​ దిగువ సభ ఆమోదం తెలిపింది. తదుపరి పరిశీలన కోసం బిల్లును 'హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌'కు పంపనున్నారు. ప్రధాని బోరిస్ జాన్సన్‌ ఇటీవల ఎన్నికల్లో దిగువ సభలో సంపూర్ణ మెజారిటీ సాధించడం వల్ల ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలగడానికి మార్గం సుగమమైంది.

BORIS
బ్రిటన్​ దిగువ సభలో బ్రెక్సిట్​ ఆమోదం

By

Published : Dec 20, 2019, 11:37 PM IST

ప్రధాని బోరిస్ జాన్సన్‌ ప్రతిపాదిత బ్రెగ్జిట్‌ నూతన ఒప్పందానికి బ్రిటన్ 'హౌస్‌ ఆఫ్ కామన్స్' ఆమోదం తెలిపింది. ఉపసంహరణ ఒప్పందపు బిల్లుపై దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో 358- 234 ఓట్ల తేడాతో నూతనంగా ఎంపికైన ఎంపీలు ఆమోదం తెలిపారు.

ఈ నేపథ్యంలో... వచ్చే ఏడాది జనవరి 31లోగా ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు అడుగులు పడ్డాయి. జాన్సన్‌ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఒప్పందంపై ఎంపీల మద్దతుకూడగట్టడంలో విఫలమైంది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ దిగువ సభలో సంపూర్ణ మెజార్టీ సాధించింది. బ్రెగ్జిట్ బిల్లును ఆమోదించేందుకు మార్గం సుగమమైంది. 'హౌస్‌ ఆఫ్ కామన్స్‌' బిల్లును ఆమోదించింది. తదుపరి పరిశీలన కోసం బిల్లును 'హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌'కు పంపనున్నారు.

ఇదీ చూడండి: చెన్నై ఇంజినీర్​కు ట్రంప్​ ప్రభుత్వంలో కీలక పదవి

ABOUT THE AUTHOR

...view details