తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రముఖ టీవీ ఛానెల్​పై భారీ జరిమానా.. కారణం! - zakir naik latest news updates

ప్రముఖ ఇస్లామిక్​ నెట్​వర్క్​ పీస్​ టీవీపై 3 లక్షల పౌండ్లు జరిమానా విధించింది బ్రిటన్​ మీడియా వాచ్​డాగ్​ ఆఫ్​కామ్ సంస్థ. ప్రసార నియమాలను ఉల్లంఘించి విద్వేషపూరిత, అభ్యంతరకరమైన విషయాలను ప్రసారం చేసినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

UK media watchdog fines Zakir Naik's Peace TV 300,000 pounds for 'hate speech'
ప్రముఖ టీవీ ఛానెల్​పై రూ.2కోట్లకు పైగా జరిమానా

By

Published : May 17, 2020, 4:53 PM IST

వివాదాస్పద ఇస్లామిక్​ బోధకుడు జాకీర్​ నాయక్ ప్రముఖ​ 'పీస్​ టీవీ' నెట్​వర్క్​పై భారీ జరిమానా విధించింది బ్రిటన్ మీడియా వాచ్​డాగ్​​ ఆఫ్​కామ్. విద్వేషపూరిత ప్రసంగం, అభ్యంతరకరమైన వార్తలను ప్రసారం చేసిందుకు 3లక్షల పౌండ్లు(రూ. 2.75కోట్లు) అపరాద రుసుము చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రసార నియమాలను ఉల్లఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

పీస్​ టీవీ ఉర్దూ ప్రసారం చేసే కార్యక్రమంలో ద్వేషపూరిత ప్రసంగం, అభ్యంతరకరమైన విషయాలు ఉన్నట్లు మా పరిశోధనల్లో తెలిసింది. ఇలాంటి ప్రసారాలు.. ఇతరులను నేరాలకు పాల్పడేలా ప్రేరేపించే అవకాశం ఉంది.

ఆఫ్​కామ్​.

లార్డ్ ప్రొడక్షన్​ లిమిటెడ్​ ఆధ్వర్యంలో పీస్​ టీవీ ప్రసారం అవుతోంది. క్లబ్​ టీవీ దీని లైసెన్స్​ను సొంతం చేసుకుంది. ఈ రెండింటికీ నాయక్​ నిర్వహణలో ఉన్న యూనివర్సల్​ బ్రాడ్​కాస్టింగ్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ మాతృ సంస్థగా వ్యవహరిస్తోంది.

ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ...

పీస్​ టీవీ లాభపేక్షలేని శాటిలైట్​ టెలివిజన్​ నెట్​వర్క్​. దుబాయ్ ప్రధాన కార్యాలయం నుంచి ఇంగ్లీష్​, బెంగాలీ, ఉర్దూ, బాషల్లో ఉచిత కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. గతంలో నాయక్ భారత్​లో మనీలాండరింగ్​, ద్వేష పూరిత ప్రసంగాల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత 2016లో భారత్​ను విడిచిపెట్టి మలేషియా వెళ్లాడు. అక్కడే శాస్వత నివాసం ఏర్పారుచుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details