UK man standing job: గంటల తరబడి క్యూలో నిలబడాలంటే చాలా మందికి చిరాకు. ఒక్కోసారి ఓపిక నశించి వచ్చిన పని పూర్తి చేసుకోకుండానే వెనుదిరుగుతుంటారు. అయితే బ్రిటన్కు చెందిన ఓ యువకుడు మాత్రం క్యూలో నిల్చొని రోజుకు రూ.16వేలు సంపాదిస్తున్నాడు. 8 గంటల పాలు ఎంతో ఓపికగా లైన్లోనే నిలిచి ఉంటున్నాడు. ఈ పని చేసి చేసి తనకు అలవాటు అయిపోయిందని చెబుతున్నాడు.
క్యూలో ఎందుకు..?
31 ఏళ్ల ఈ బ్రిటన్ యువకుడి పేరు ఫ్రెడ్డీ బెకిట్. తీరిక లేని ధనవంతులు కొన్ని పనుల కోసం క్యూలో ఎక్కువ సేపు నిలబడలేరు. అలాంటి వారి కోసం ఫ్రెడ్డీ లైన్లో నిలబడతాడు. గంటకు 20 యూరోలు(దాదాపు రూ.2వేలు) ఛార్జ్ చేస్తాడు. ఇలా రోజూ తన క్లయింట్స్ కోసం 8 గంటల వరకు క్యూలో నిల్చుంటాడు. దీని వల్ల రోజుకు 160 యూరోలు(రూ.16,234) అతనికి ముడతాయి.
బ్రిటన్లో తరచూ చాలా ఈవెంట్లు జరుగుతాయి. వాటికి టికెట్లు కావాలంటే కనీసం గంటైనా క్యూలో నిల్చోవాలి. అందుకే వృద్ధులు, ధనికులు ఫ్రెడ్డీ వంటివారి సేవలు పొందుతారు.