దేశంలో మూడోసారి లాక్డౌన్ విధించడం కంటే.. గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పేరుకుపోయినా ఫర్వాలేదని, అదే మేలు అని తాను చెప్పినట్లుగా మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఖండించారు. అవి పూర్తిగా చెత్త ఆరోపణలు అని ఆయన మండిపడ్డారు.
'లాక్డౌన్ కంటే శవాల గుట్టలే మేలు!' - బ్రిటన్ ప్రధాని
మూడోసారి లాక్డౌన్పై వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. గతేడాది చివరిలో.. 'లాక్డౌన్ కంటే గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పేరుకుపోయినా ఫర్వాలేదని, అదే మేలు' అని బోరిస్ చెప్పినట్లు ఓ మీడియా పేర్కొంది.
బోరిస్
రెండోసారి లాక్డౌన్ విధించిన సందర్భంగా 2020 చివరిలో జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ డైలీ మెయిల్ ఇటీవల తన కథనంలో పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆ పత్రిక ఎలాంటి ఆధారాలు పేర్కొనలేదు. కాకపోతే జాన్సన్ కార్యాలయం నుంచి ఈ లీకులు వచ్చినట్లు తెలిపింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.