చారిత్రక పాయింట్స్ ఆధారిత వీసా వ్యవస్థను బ్రిటన్ ప్రవేశపెట్టింది. నైపుణ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకునే ఈ నూతన వీసా వ్యవస్థతో భారత్ సహా ప్రపంచ దేశాలు లబ్ధిపొందనున్నాయి. దీని ద్వారా దేశంలోకి అనవసర, నైపుణ్యం లేని ఉద్యోగుల ప్రవేశానికి అడ్డుకట్ట వేసింది ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం.
నూతన వీసా వ్యవస్థను ప్రవేశపెట్టిన బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్.. నైపుణ్యం, వృత్తి, జీతం వంటివి పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తున్నట్టు వివరించారు. 2021 జనవరి 1న ఈ నూతన వీసా వ్యవస్థ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అప్పటితో ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ పూర్తికానుంది.
"బ్రిటన్కు ఇది చారిత్రక ఘట్టం. దేశంలోకి విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రిస్తున్నాం. దీని వల్ల సరిహద్దుపై మరింత పట్టు వస్తుంది. ఈ నూతన వ్యవస్థ ద్వారా వలసదారుల సంఖ్య తగ్గుతుంది. ప్రపంచ దేశాల్లోని ప్రతిభావంతులను ఈ వ్యవస్థ ఆకర్షిస్తుంది. దీని వల్ల మన ఆర్థిక వ్యవస్థ, సమాజం మరితం శక్తిమంతంగా మారుతుంది."