కరోనా వైరస్, పర్యావరణ మార్పులపై పరిశోధనలు చేసే విధంగా శాస్త్రవేత్తలకు మద్దతునిచ్చేందుకు మూడు మిలియన్ పౌండ్ల(సుమారు రూ.30కోట్లు) 'ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్'ను ప్రకటించింది బ్రిటన్. భారత్తో రెండేళ్ల ముందు ఏర్పరచుకున్న సాంకేతిక భాగస్వామ్యానికి ఊతమందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్లోని బ్రిటన్ హైకమిషన్ ప్రకటన ప్రకారం.. కృత్రిమ మేథస్సుకు సంబంధించి కర్ణాటకలో ఉన్న డేటా క్లస్టర్, మహారాష్ట్రలోని ఫ్యూచర్ మొబిలిటీ క్లస్టర్లలోని సాంకేతిక రంగంలోకి పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి ఈ నిధి ఉపయోగపడుతుంది. ఇది కరోనా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అధ్యయనం, పరిశోధనలు, అభివృద్ధి ప్రణాళికలను అందిస్తాయని స్పష్టం చేసింది.