తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వీరవైద్యులకు మౌనంతో బ్రిటన్​ వందనం - BORIS JOHNSON LATEST NEWS

కరోనా వైరస్​పై సాగుతున్న యుద్ధంలో మరణించిన బ్రిటన్​ వైద్య సిబ్బందికి ఆ దేశ ప్రజలు సంఘీభావం తెలిపారు. ఒక నిమిషం పాటు మౌనం పాటించి.. వారి సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రధాని బోరిస్​ జాన్సన్​ కూడా వైద్య సిబ్బందికి నివాళులర్పించారు.

uk-holds-a-minutes-silence-for-covid-19-frontline-healthcare-victims-by-aditi-khanna
వైద్య సిబ్బంది కోసం బ్రిటన్​ వాసుల మౌనం

By

Published : Apr 28, 2020, 11:20 PM IST

కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వైద్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు బ్రిటన్​ వాసులు. వారి కోసం ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. వైరస్​ను జయించిన బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ కూడా మరణించిన వైద్య సిబ్బందికి నివాలర్పించారు.

కరోనా వీరవైద్యులకు మౌనంతో బ్రిటన్​ వందనం

ఎందరో కరోనా బాధితులకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇప్పటి వరకు బ్రిటన్​ ఆరోగ్య సర్వీసెస్​కు చెందిన 82 మంది ఆరోగ్య సిబ్బంది కరోనా వల్ల మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో భారత సంతతికి చెందిన వారు కూడా ఉన్నారు.

దేశ ప్రజలతో పాటు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​, బ్రిటన్ ఛాన్సులర్​ రిషి సునక్​ వైద్య సిబ్బందికి నివాళులర్పించారు. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ కూడా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.

విధులు నిర్వహిస్తూ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వైద్య సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడం కోసం 60 వేల పౌండ్లతో లైఫ్​ అస్యూరెన్స్​ పథకాన్ని ప్రారంభించింది బ్రిటన్​ ప్రభుత్వం.

ABOUT THE AUTHOR

...view details