తెలంగాణ

telangana

ETV Bharat / international

కొంపముంచిన ఎక్సెల్​ షీట్​- 50 వేల మందికి కరోనా ముప్పు! - ఎక్సెల్ ఫైల్ ఆటోమేటెడ్ ట్రాన్స్​ఫర్ యూకే

ఎక్సెల్ స్ప్రెడ్​షీట్లలో సాంకేతిక లోపం కారణంగా యూకేలో 16 వేల కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రాలేదు. ఫలితంగా వీరిని కాంటాక్ట్ అయిన 50 వేల మందిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని బ్రిటన్ వైద్య శాఖ మంత్రి తెలిపారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

UK hit by new virus test failing, finds 16,000 extra cases
సాంకేతిక లోపంతో 16 వేల కరోనా కేసులు మాయం

By

Published : Oct 6, 2020, 2:59 PM IST

సాంకేతిక లోపం వల్ల యూకేలో దాదాపు 16 వేల కేసులు నమోదు కాలేదని బ్రిటన్ ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయంపై విచారణకు ఆదేశించింది.

'ఫైళ్ల ఆటోమేటెడ్ ట్రాన్స్​ఫర్' విధానంలో ఈ సమస్య తలెత్తిందని వైద్య శాఖ మంత్రి మాట్ హాన్​కాక్​ తెలిపారు. టెస్ట్​ అండ్ ట్రేస్​లో ఉపయోగించే ఎక్సెల్ స్ప్రెడ్​షీట్లలో ఫైల్​ సైజుపై పరిమితి ఉండటం వల్లే సమస్య ఏర్పడిందని భావిస్తున్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 మధ్య 15,841 కేసులను వివరాల్లో పొందుపర్చలేదని గతవారం హాన్​కాక్ వెల్లడించారు. తాజాగా ఈ విషయాన్ని యూకే దిగువ సభకు వివరించారు.

"ఇది చాలా తీవ్రమైన సమస్య. దీనిపై పూర్తి దర్యాప్తు జరుగుతుంది. ఈ వివరాలను సరిచేసి, మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసుకునేందుకు మేం కలిసి పనిచేస్తాం."

-మాట్ హాన్​కాక్,​ యూకే వైద్య శాఖ మంత్రి

టెస్టుల్లో పాజిటివ్​గా తేలిన వారికి సరైన ఫలితాలనే పంపించినట్లు తెలుస్తోంది. అయితే వారిని కాంటాక్ట్ అయిన 50 వేల మంది వివరాలు మాత్రం తెలియలేదు. వీరిని గుర్తించకపోతే వైరస్ కేసులు మరింతగా విజృంభిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. మహమ్మారిపై పోరాటంలో ప్రభుత్వం ఎంత అశ్రద్ధ వహిస్తోందో తెలుస్తోందంటూ లేబర్ పార్టీ నేత జొనథన్ యాష్​వర్త్​ విమర్శించారు. పరీక్షల్లో వైఫల్యాలతో దేశ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపించారు.

కరోనా టెస్టుల సామర్థ్యంపైనా చట్టసభ్యులు విమర్శలు చేశారు. పరీక్షల కోసం కొంత మంది ప్రజలు వందల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తోందని... సకాలంలో ఫలితాలు కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

భారీ ప్రాజెక్టులకు కుదరదు

ఆటోమెటెడ్ ప్రక్రియలో ఎక్సెల్ ఫైల్ సామర్థ్యం గరిష్ఠ స్థాయికి చేరుకోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల కోసం ఈ సాఫ్ట్​వేర్ ప్రధానమైనప్పటికీ.. భారీ ప్రాజెక్టుల్లో వీటిని ఉపయోగించేందుకు చాలా పరిమితులు ఉన్నాయని కేంబ్రిడ్జి యూనివర్సిటీ కమ్యునికేషన్స్ సిస్సమ్స్​ విభాగ ఆచార్యులు జోన్ క్రోక్రాఫ్ట్​ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details