తెలంగాణ

telangana

ETV Bharat / international

అప్పగింతపై మాల్యాకు యూకే హైకోర్టులో ఊరట - హైకోర్టు

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు విజయ్​ మాల్యాకు బ్రిటన్​ హైకోర్టులో ఊరట లభించింది. భారత్​కు అప్పగించాలన్న బ్రిటన్​ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అనుమతివ్వాలన్న మాల్యా అభ్యర్థనను మన్నించింది న్యాయస్థానం.

మాల్యా

By

Published : Jul 2, 2019, 8:51 PM IST

Updated : Jul 2, 2019, 10:45 PM IST

మాల్యాకు ఊరట!

బ్రిటన్​ హైకోర్టులో బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడు విజయ్​ మాల్యాకు ఊరట లభించింది. భారత్​కు అప్పగించాలన్న బ్రిటన్​ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మాల్యా పిటిషన్​ వేశారు. పరిశీలించిన హైకోర్టు.. మాల్యాకు అనుమతి ఇచ్చింది.

హైకోర్టు అనుమతించక పోయినట్లయితే 28 రోజుల్లోగా మాల్యాను భారత్​కు అప్పగించవలసి వచ్చేది. హైకోర్టు అనుమతి రావటం వల్ల ఈ అంశంపై ఇంకా వాదనలు కొనసాగుతాయి.

అప్పటికీ ఫలితం లేకపోతే భారత్​కు రాకుండా ఉండేందుకు మాల్యాకు మరో అవకాశం ఉంది. ఐరోపా మానవ హక్కుల కోర్టును ఆశ్రయించవచ్చు. భారత్​కు అప్పగిస్తే తనకు అపాయం జరుగుతుందని, హింసిస్తారని నిరూపించగలిగితే మాల్యా అప్పగింతకు వ్యతిరేకంగా ఐరోపా మానవ హక్కుల కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: విచారణకు 'అప్పగింత'పై మాల్యా అప్పీలు

Last Updated : Jul 2, 2019, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details