భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని లండన్ పరారైన విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన లండన్ హైకోర్టు.. ఖాతాల నిలిపివేతకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జడ్జి మైఖేల్ బ్రిగ్స్ ఉత్తర్వులు జారీ చేశారు.
యూకే కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ.. ఆస్తుల స్వాధీనానికి ఓకే - మాల్యా ఆస్తుల నిలిపివేత
భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని లండన్ పరారైన విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన లండన్ హైకోర్టు అంగీకరించింది.
విజయ్ మాల్యా
మాల్యా ఆస్తుల నిలిపివేతకు సంబంధించిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ అతని తరుపు న్యాయవాది ఫిలిప్ మార్షల్ కోరారు. దీనిపై స్పందించన న్యాయమూర్తి.. మాల్యా అభ్యర్థనలను తిరస్కరించారు. నిర్ణీత కాల వ్యవధిలో తీసుకున్న మొత్తాన్ని చెల్లించాలని.. లేకపోతే అందుకు తగిన సాక్ష్యాలు చూపించాలని కోరారు.
ఇదీ చూడండి:విజయ్ మాల్యాకు కోర్టులో మరో ఎదురుదెబ్బ
Last Updated : Jul 26, 2021, 10:23 PM IST