లండన్‌లో వచ్చే నెల జరగనున్న జీ-7 విదేశాంగ మంత్రుల సదస్సుకు భారత్‌ను బ్రిటన్ ఆహ్వానించింది. ఆతిథ్య దేశ హోదాలో భారత్.. ఈ సమావేశంలో పాల్గొంటుందని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డామినిక్ రాబ్ తెలిపారు. మే 3 నుంచి 5 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.
"జీ-7 దేశాలతో పాటు ఆతిథ్య దేశాలు సమావేశాల్లో పాల్గొంటే.. ఇండో- పసిఫిక్ ప్రాంత దేశాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సమస్యలపై విస్తృత అవగాహన ఏర్పడుతుంది. వచ్చే నెలలో జరగబోయే ఈ సమావేశం వల్ల.. ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది. యూకేలోని కరోనా నిబంధనల మేరకే ఈ సమావేశాలు జరుగుతాయి."