దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్‌ను గుర్తించనట్లు అక్కడి అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ సోకిన రోగులు చెమ్స్‌ఫోర్డ్, నాటింగ్‌హామ్‌లకు చెందిన వారని పేర్కొన్నారు. తాజా పరిణామాలతో.. మరో నాలుగు దేశాలు బ్రిటన్ ప్రయాణ నిషేధిత జాబితాలో చేర్చినట్లు చెప్పారు.
కొత్తగా గుర్తించిన కేసులకు సంబంధించిన వారికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతున్న సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. వీరికి దక్షిణాఫ్రికా ప్రయాణికులతో సంబంధం ఉన్నట్లు స్పష్టం చేశారు.
ముందుజాగ్రత్త చర్యగా.. కొత్త కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆ దేశ హెల్త్ సెక్రెటరీ సాజీద్ జావిద్ తెలిపారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాత్మక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: