అప్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణ.. ఉగ్రవాదులకు స్ఫూర్తిని కలిగించే ప్రమాదం ఉందని బ్రిటన్ రక్షణశాఖ మంత్రి బెన్ వాలెస్ హెచ్చరించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా భద్రతా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పశ్చిమ దేశాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని ఆయన సూచించారు.
అప్గాన్ నుంచి బ్రిటన్ పౌరుల తరలింపును పర్యవేక్షిస్తున్న మంత్రి బెన్.. సగం విమానాలు ఖాళీగా ఉన్నాయని వస్తున్న కథనాలను తోసిపుచ్చారు. 7 నుంచి 10 రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్యాక్డ్ విమానాలు ప్రతిరోజు టేకాఫ్ అవుతున్నాయని వాలెస్ చెప్పారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు అందరూ కృషి చేయాలని మరో యూకే మంత్రి డొమినిక్ రాబ్ కోరారు. అందుకు భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, మధ్య ఆసియా దేశాల మద్దతు అవసరమని పేర్కొన్నారు.