Uk covid boosters: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లు పైబడిన వారికీ బూస్టర్ డోసులు అందించడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి సోమవారం నుంచి బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 40 ఏళ్లకు పైబడిన 2 కోట్ల మందికి బూస్టర్ డోసులు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Covid vaccination in britan: 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్కులు సుమారు 75 లక్షల మంది ఉండగా, అందులో 35 లక్షల మందిని బూస్టర్ డోసుకు అర్హులుగా తేల్చారు. బూస్టర్ డోసుతో ఒమిక్రాన్ నుంచి రక్షణ పెరుగుతుందని అధ్యయనాల్లో తేలిన నేపథ్యంలో, బ్రిటన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన వాటిని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఇదీ చూడండి:బూస్టర్ డోసు వేసుకున్నా వదలని 'ఒమిక్రాన్'!
'ఏప్రిల్ నాటికి 75వేల 'ఒమిక్రాన్' మరణాలు'
Uk omicron cases: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో ఉద్భవించినప్పటికీ.. దీని వ్యాప్తి బ్రిటన్‌లోనే అధికంగా ఉన్నట్లు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్ కొద్దిరోజుల క్రితమే తెలిపింది. ఇదిలా ఉండగా అదనపు రక్షణ చర్యలు తీసుకోకపోతే యూకేలో భారీ ప్రాణనష్టం తప్పదని.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 25వేల నుంచి 75వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని తాజాగా వెల్లడించింది. ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య 60 శాతం పెరగనున్నట్లు తెలిపింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్‌తోపాటు దక్షిణాఫ్రికాలోని స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్త అధ్యయనంలో ఈమేరకు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత, టీకాల ప్రభావం ఆధారంగా వారు ఈ అధ్యయనం చేశారు.