తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​కు​ భారీ షాక్​ ఇచ్చిన బ్రిటన్​ కోర్టు - పాకిస్థాన్​ నేషనల్​ అకౌంటెబిలిటీ బ్యూరో

జిత్తులమారి పాకిస్థాన్​కు బ్రిటన్​ కోర్టు భారీ షాక్​ ఇచ్చింది. లండన్​లోని పాక్​ హైకమిషన్​ ఖాతాల నుంచి 28.7 మిలియన్​ డాలర్ల జరిమానా సొమ్మును డెబిట్​ చేయాలని ఆదేశించింది. బ్రాడ్​షీట్​ ఎల్​ఎల్​సీ కేసుకు సంబంధించి జరిమానా చెల్లింపుల్లో జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది లండన్​ హైకోర్టు.

Pak High Commission
పాకిస్థాన్​కు​ భారీ షాక్​ ఇచ్చిన బ్రిటన్​ కోర్టు

By

Published : Jan 2, 2021, 10:22 AM IST

పాకిస్థాన్​ నేషనల్​ అకౌంటెబిలిటీ బ్యూరో (ఎన్​ఏబీ)కి భారీ షాక్​ ఇచ్చింది బ్రిటన్​ కోర్టు. తమ దేశంలోని పాక్​ హై కమిషన్​ ఖాతాల నుంచి 28.7 మిలియన్​ డాలర్లు జరిమానాల సొమ్మును డెబిట్​ చేయాలని ఆదేశించింది లండన్​ హైకోర్టు. విదేశీ ఆస్తుల రికవరీ సంస్థ బ్రాడ్​షీట్​ ఎల్ఎల్​సీ కేసుకు సంబంధించి 21 మిలియన్​ డాలర్లు జరిమానాను చెల్లించటంలో ఎన్​ఏబీ జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నందుకుగానూ ఈ నిర్ణయం తీసుకుంది.

కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నగదును పాకిస్థాన్​ హైకమిషన్​ ఖాతాల నుంచి డిసెంబర్​ 30 లోపు డెబిట్​ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని పాకిస్థాన్​ విదేశీ వ్యవహారాల శాఖ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. పాక్​ హైకమిషన్​ ఖాతాల నుంచి మిలియన్ల డాలర్లు డెబిట్​ చేయాలని లండన్​ కోర్టు ఆదేశించినట్లు పేర్కొన్నాయి.

బ్యాంక్​ లేఖ..

కోర్టు ఆదేశాలను సూచిస్తూ.. పాక్​ హై కమిషన్​కు డిసెంబర్​ 29న లేఖ రాసింది యునైటెడ్​ బ్యాంక్​ లిమిటెడ్​ యూకే. 28,706,533.35 డాలర్లు తమ ఖాతాల్లోకి జమ చేసేందుకు అవసరమైన రాతపూర్వక చెల్లింపు సూచనలు, డెబిట్​ ఖాతా వివరాలు ఇవ్వాలని కోరింది. డిసెంబర్​ 30 లోపు రాతపూర్వకంగా పేమెంట్​ సూచనలు ఇవ్వకపోతే.. కోర్టు ఆదేశాలను ఏకపక్షంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.

విదేశీ చట్టాల ఉల్లంఘనే..

మరోవైపు.. బ్యాంకు లేఖను తప్పుపట్టింది పాక్​ హైకమిషన్​. తమ ఖాతాల నుంచి నగదు బదిలీ చేసేందుకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అది అంతర్జాతీయ చట్టాలు, నమ్మకాన్ని ఉల్లంఘించటమే అవుతుందని తెలిపింది. అలాంటి నిర్ణయాలతో బ్యాంకుతో ఉన్న సంబంధాలు బలహీనపడతాయని పేర్కొంది.

2018లో..

పాక్​ ఎన్​ఏబీకి 2018లో 17 మిలియన్​ డాలర్ల జరిమానా విధించింది లండన్​ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు (ఎల్​సీఏఐ). ఆ తర్వాత మరో 3 మిలియన్​ డాలర్లు కోర్టు ఖర్చుల కింద చేర్చింది. 2019, మార్చిలో మొత్తంగా 20 మిలియన్​ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. పాక్​ ఎన్​ఏబీ జరిమానా చెల్లించకపోవటం వల్ల వడ్డీతో కలిపి మొత్తం 28.7 మిలియన్​ డాలర్లకు చేరుకుంది.

ఇదీ చూడండి:రూ. 460కోట్ల ఉగ్రవాద నిధులకు అమెరికా అడ్డుకట్ట

ABOUT THE AUTHOR

...view details