తెలంగాణ

telangana

ETV Bharat / international

నీరవ్ మోదీకి మరోసారి బెయిల్ నిరాకరణ - banking system in india

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 13వేల కోట్ల రుణాలను ఎగవేసి లండన్​కు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీకి మరోసారి చుక్కెదురైంది. లండన్​లోని వెస్ట్​మినిస్టర్ న్యాయస్థానం ఆయనకు బెయిల్​ నిరాకరించింది.

నీరవ్​కు మరోసారి బెయిల్ నిరాకరణ!

By

Published : Nov 6, 2019, 6:23 PM IST

పరారీలో ఉన్న రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టులో చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నీరవ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం కొట్టేసింది. పంజాబ్​ నేషనల్​ బ్యాంకుంలో రూ. 13వేల కోట్ల రుణ ఎగవేత, మనీ ల్యాండరింగ్ కేసులో నీరవ్​ను భారత్​కు అప్పగించే అవకాశాల నేపథ్యంలో నీరవ్​కు బెయిల్ నిరాకరించింది కోర్టు.

బెయిల్​ కోసం 2 నుంచి 4 మిలియన్ల పూచీకత్తును సమర్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటీకీ న్యాయమూర్తి ఎమ్మా అర్బథాంట్.. నీరవ్ అభ్యర్థనను తోసిపుచ్చారు. తీవ్ర ఆందోళన, నిరాశలతో తన మానసిక స్థితి సరిగా లేదని తాజా బెయిల్ దరఖాస్తులో ఆయన కోర్టుకు విన్నవించారు.

నీలం రంగు స్వెటర్, నున్నగా గెడ్డం గీసుకుని బెయిల్ విచారణకు హాజరయ్యారు నీరవ్. ఇంతకు ముందుకన్నా ఆరోగ్యంగా కనిపించారు.

జైల్లో తమ క్లయింట్ పరిస్థితి దారుణంగా ఉందని.. కట్టుదిట్టమైన భద్రత మధ్య గృహ నిర్బంధంలో ఉంచాలని ఇంతకుముందు బెయిల్​ పిటిషన్​లో నీరవ్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

ఇదీ చూడండి: ఊరంతా ఏకమై పేడతో కొట్టుకున్నారు... ఎందుకో?

ABOUT THE AUTHOR

...view details