భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల పేదలను ఆదుకోవడానికి విరాళాలు సేకరించేందుకు వర్చువల్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది బ్రిటన్ను చెందిన యాక్షన్ విలేజ్ ఇండియా(ఏవీఐ) ఛారిటీ. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఏటా ఘనంగా నిర్వహించే ఈ ఫెస్టివల్‌ను కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు చేశారు. విరాళాల కోసం ఆన్లైైన్లోనే వేడుకను నిర్వహిస్తున్నారు.
భారత్‌లోని పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి గత 25ఏళ్లకుపైగా ఇక్కడి మారుమూల గ్రామాల్లోని పేదలకు సాయం అందిస్తోంది ఏవీఐ. మహిళలు, చిన్నారులకు ఉన్న హక్కులు పొందేలా చేసి వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడుతోంది. లింగ, కుల, మతాలతో సంబంధం లేకుండా అందరూ భూమి, నీరు, విద్య వంటి హక్కులు పొందెందుకూ తన వంతు చేయూత అందిస్తోంది.