బ్రిటన్ రాజధాని లండన్‌లోని ఇంపీరియల్ కళాశాల వ్యాక్సిన్ తయారీ దిశగా మరో ముందడుగు వేసింది. 300 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులకు పరిశోధనాత్మక వ్యాక్సిన్‌ను ఇవ్వనుంది. తమ కళాశాలకు చెందిన విద్యార్థులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించనుంది. ఇందులో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఇంపీరియల్ కళాశాల తయారుచేసిన ఈ వ్యాక్సిన్ తయారీకి బ్రిటన్ ప్రభుత్వం 51 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందించింది.
ఇప్పటివరకు ల్యాబొరేటరీలో జంతువులపై వ్యాక్సిన్‌ను పరీక్షించినట్లు చెప్పారు శాస్త్రవేత్తలు. వైరస్‌తో బాధపడే రోగులతో పోలిస్తే ఆయా జంతువుల్లో యాంటీబాడీలు అధికస్థాయిలో ఉత్పత్తి అయినట్లు చెప్పారు.
"దీర్ఘకాలికంగా బలహీనంగా ఉన్నవారి కోసం ఓ కీలక వ్యాక్సిన్‌ను తయారుచేయాలి. ఆంక్షలను సడలించి ప్రజా జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలి."
-రాబిన్ షాటోక్, పరిశోధకుడు