కరోనా చికిత్సకు తొలిసారి మాత్ర (Pills for Covid treatment) అందుబాటులోకి వచ్చింది. మోల్నుపిరవిర్ పేరుతో మెర్క్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన ఈ పిల్.. కరోనాపై సమర్థంగా పోరాడుతోందని తేలింది. కరోనా బాధితుల కోసం దీన్ని వినియోగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కొవిడ్ బారిన పడ్డ వయోజనుల కోసం ఈ పిల్స్ వినియోగించవచ్చు. అయితే కరోనా రిస్క్ ఫ్యాక్టర్లలో ఏదో ఒకటి బాధితులకు ఉంటేనే వీటిని తీసుకోవాలని యూకే నియంత్రణ సంస్థ పేర్కొంది. ఐదు రోజుల పాటు రోజుకు రెండు సార్లు ఈ మాత్రను తీసుకోవాల్సి ఉంటుంది.
అమెరికా ఎఫ్డీఏ వద్ద మోల్నుపిరవిర్ దరఖాస్తు పెండింగ్లో ఉంది. దీనికి అనుమతులు లభించకముందే చాలా వరకు దేశాలు మాత్రల కోసం ముందస్తు ఆర్డర్లు ఇచ్చేశాయి.